MDK: తూప్రాన్ పట్టణ పశువుల సంత 2026-2027 సంవత్సరానికి సంబంధించిన వేలం పాటను ఈ నెల 16న నిర్వహించనున్నట్లు మున్సిపల్ కమిషనర్ పాతూరి గణేష్ రెడ్డి తెలిపారు. మున్సిపల్ కార్యాలయ ఆవరణలో జరిగే ఈ వేలంలో పాల్గొనే వారు రూ.50 వేల ముందస్తు డీడీ సమర్పించాలని సూచించారు. గతంలో పోటీదారులు ఆసక్తి చూపకపోవడంతో పలుమార్లు వేలం వాయిదా పడగా, ఈసారి విజయవంతం చేయాలన్నారు.