పాలస్తీనా అధ్యక్షుడితో ప్రధాని మోదీ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా గాజాలోని మానవతా పరిస్థితిపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. పాలస్తీనా ప్రజలకు భారత్ నుంచి నిరంతర మద్దతు ఉంటుందని పునరుద్ఘాటించారు. క్వాడ్ సదస్సులో పాల్గొనేందుకు అమెరికా వెళ్లిన మోదీ.. కువైట్ యువరాజు షేక్ సబాహ్ ఖలేద్, నేపాల్ ప్రధాని కేపీ శర్మతోనూ ద్వైపాక్షిక చర్చలు జరిపారు. పలువురు భారతీయ మూలాలున్న సీఈవోలతో కూడా భేటీ అయ్యారు.