VKB: తాండూర్ భావిగి భద్రేశ్వర జాతర ఉత్సవాల్లో ఫ్లెక్సీల వార్ నడుస్తోంది. శనివారం జరిగిన జాతర ఉత్సవాల సందర్భంగా వివిధ పార్టీ నేతల ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. కాగా స్థానిక ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి ఫ్లెక్సీలు గుర్తుతెలియని వ్యక్తులు చింపేశారు. బద్రేశ్వర స్వామి జాతర ఉత్సవాల్లో ఏటా ఓ వివాదం జరిగి అది తీవ్ర రూపం దాల్చుతుంటాయని పలువురు విమర్శిస్తున్నారు.