అనకాపల్లిలో ఎస్సీ, ఎస్టీ, బీసీ మహిళా హాస్టల్ ఏర్పాటు చేయాలని ఏఐఎస్ఎఫ్ జిల్లా కార్యదర్శి ఫణి కుమార్ డిమాండ్ చేశారు. హాస్టల్ ఏర్పాటు కోసం వచ్చే నెల 9 నుంచి 14 వరకు అనకాపల్లిలో రిలే నిరాహార దీక్షలు చేపట్టనున్నట్లు పేర్కొన్నారు. మంగళవారం ఎలమంచిలిలో గోడపత్రిక ఆవిష్కరించారు. హాస్టల్ ఏర్పాటుకు గతంలో పలు సార్లు అధికారుల దృష్టికి తీసుకువెళ్లినా స్పందన లేదని పేర్కొన్నారు.