సూపర్-8 భాగంగా పల్లెకెలె వేదికగా పాకిస్తాన్, ఇంగ్లండ్ తలపడనున్నాయి. ఈ మ్యాచ్లో పాకిస్తాన్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. పాక్ తొలి మ్యాచ్ వర్షంతో రద్దు కావడంతో ఈ మ్యాచ్లో ఖచ్చితంగా గెలవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఒకవేళ ఓడితే సెమీస్ రేసు నుంచి నిష్క్రమిస్తుంది. మరోవైపు శ్రీలంకపై గెలిచిన ఇంగ్లండ్.. ఈ మ్యాచ్లోనూ గెలిస్తే సెమీస్కు చేరుకుంటుంది.