AKP: స్నేహపూర్వకమైన పాలనకు అధికారులు సహకరించాలని చోడవరం ఎమ్మెల్యే కేఎస్ఎన్ఎస్. రాజు పిలుపునిచ్చారు. ‘ఇది మంచి ప్రభుత్వం’ కార్యక్రమం ఆదివారం రావికమతం మండల పరిషత్లో నిర్వహించారు. వివిధ అవసరాల నిమిత్తం ప్రభుత్వ కార్యాలయాలకు వచ్చిన ప్రజలను బెదిరించే ధోరణికి అధికారులు స్వస్తి పలకాలని హితవు పలికారు.