సిరిసిల్ల: గోడ కూలి మీద పడడంతో మహిళ మృతిచెందిన ఘటన వీర్నపల్లి మండలం సీతారాంనాయక్తండాలో విషాదం నింపింది. గ్రామానికి చెందిన బానోత్ లక్ష్మి(62) గేదెలు కాస్తూ ఉపాధి పొందుతోంది. పశువులను మేతకోసం తండా శివారులోని స్మశానవాటిక వద్దకు తీసుకెళ్లింది. అక్కడే ఉన్న ఈజీఎస్ గద్దెకు ఒరిగి కూర్చుంది. గేదెలు తాకడంతో గద్దె కూలి, ఇటుకలు పడి మృతి చెందింది.