తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. తాజాగా టాలీవుడ్ హీరో నిఖిల్ ఈ వివాదంపై స్పందించాడు. ‘ తిరుమల లడ్డూ ప్రసాదంలో కల్తీ జరిగిందని తెలిసి షాక్ అయ్యాను. ఈ పని చేసిన వారిని కఠినంగా శిక్షించాలి. నిందితులను కోర్టుకు ముందుకు తీసుకురావాలి. ఇది ఏ ఒక్కరికో కాదు. ప్రతి భారతీయుడి విశ్వాసానికి జరిగిన అవమానం’ అని ట్వీట్ చేస్తూ.. ప్రధాని మోదీ, సీఎం చంద్రబాబు, పవన్ కళ్యాణ్‌ను ట్యాగ్ చేశాడు.