కామారెడ్డి మండలం గూడెం గ్రామంలో డ్వాక్రా మహిళలకు గురువారం వైద్య అధికారులు రోగ నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు. డ్వాక్రా మహిళలకు బీపీ, షుగర్, హిమోగ్లోబిన్, గర్భకోశ క్యాన్సర్ రక్త పరీక్షలు చేపట్టారు. ఈ కార్యక్రమంలో ఐకేపీ సీసీ సీహెచ్ గంగారెడ్డి పల్లె దవాఖానా సిబ్బంది, గ్రామ సంఘం అధ్యక్షురాలు, డ్వాక్రా మహిళలు పాల్గొన్నారు.