అస్సాం, కేరళతో పాటు కేంద్రపాలిత ప్రాంతమైన పుదుచ్చేరిలో రేపు అసెంబ్లీ ఎన్నికలు ఒకే విడతలో జరగనున్నాయి. ఆయా రాష్ట్రాల్లో పోలింగ్ ప్రశాంతంగా జరిగేందుకు ఎన్నికల అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. ఇవాళ సాయంత్రం పోలింగ్ కేంద్రాలకు సిబ్బందితో పాటు పోలింగ్ సామగ్రిని తరలించనున్నారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా భారీ బందోబస్తు నిర్వహించారు.