WNP: శ్రీరంగాపూర్ మండల పరిధిలోని వెంకటాపూర్ గ్రామానికి చెందిన ఈరపాగ చిన్నయ్య అనారోగ్యంతో మరణించారు. ఇట్టి విషయం తెలుసుకున్న సింగిల్ విండో ఛైర్మన్ జగన్నాథం నాయుడు మృతదేహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం మృతుని కుటుంబానికి 5000 రూపాయలు ఆర్థిక సహాయాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆంజనేయులు, జగతి నాయుడు, అశోక్, రాఘవేందర్ తదితరులు పాల్గొన్నారు.