ELR: ఉభయ గోదావరి జిల్లాల్లోని 44 మెడికల్ షాపులపై సోమవారం ఔషధ నియంత్రణ శాఖ అధికారులు ఆకస్మిక దాడులు నిర్వహించారు. డ్రగ్స్ అండ్ కాస్మెటిక్స్ నిబంధనలను ఉల్లంఘించినట్లు గుర్తించిన పలు దుకాణాలకు షోకాజ్ నోటీసులు జారీ చేసినట్లు ఏలూరు రీజియన్ ఉప సంచాలకులు తెలిపారు. ప్రజలు తప్పనిసరిగా వైద్యుల ప్రిస్క్రిప్షన్తోనే మందులు కొనుగోలు చేయాలని సూచించారు.