AKP: కోటవురట్ల మండలం కైలాసపట్నంలో ఆదివారం క్రైస్తవులు ఈస్టర్ పండగను సాంప్రదాయబద్ధంగా జరుపుకున్నారు. ఉదయాన్నే సమాధుల వద్దకు వెళ్లి పూజలు చేసి క్యాండిల్స్ వెలిగించారు. అనంతరం చర్చిలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ఏసు క్రీస్తు మృతి చెందిన తర్వాత మూడో రోజున సమాధి నుంచి లేచిన సందర్భంగా పురస్కరించుకుని క్రైస్తవులు ఈ పండుగను జరుపుకుంటారు.