TG: రానున్న కొద్ది గంటల్లో HYD, ఆదిలాబాద్, ఆసిఫాబాద్ మంచిర్యాల, మెదక్, సంగారెడ్డి, వికారాబాద్, జనగాం, యాదాద్రి, నిర్మల్ జిల్లాల్లో వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. 41-61 కి.మీ వేగంతో గాలులు వీస్తాయని పేర్కొంది. ఆయా జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. కాగా, నిన్న రాత్రి కామారెడ్డి, సిరిసిల్ల జిల్లాల్లో అర్థరాత్రి ఉరుములతో కూడిన భారీ వర్షం పడింది.