RR: రాష్ట్ర మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు ఎర్రబెల్లి స్వర్ణను శేరిలింగంపల్లి నియోజకవర్గ మహిళా కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ శిరీష సత్తూర్ మర్యాదపూర్వకంగా కలిసి సన్మానించి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా స్వర్ణ మాట్లాడుతూ.. నియోజకవర్గంలో మహిళా కాంగ్రెస్ను మరింత పటిష్టం చేసేందుకు కృషి చేయాలని, ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని సూచించారు.