SKLM: రోజురోజుకు ఎండ తీవ్రత పెరగడంతో పలాస కాశీబుగ్గ మున్సిపాలిటీ పరిధి అక్కుపల్లి జంక్షన్, కాశీబుగ్గ బస్టాండ్, నెహ్రూ పార్క్‌ల వద్ద చలివేంద్రాలను ఇవాళ ఎమ్మెల్యే గౌతు శిరీష ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. జంట పట్టణాలకు వివిధ పనుల నిమిత్తం ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజల దాహాన్ని తీర్చేందుకు ఈ చలివేంద్రాలు ఎంతగానో ఉపయోగపడతాయని తెలిపారు.