AP: ఇతర రాష్ట్రాల బోట్లు రాష్ట్ర సముద్ర జలాల్లోకి చొరబడకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను CM చంద్రబాబు ఆదేశించారు. ఈ మేరకు హైస్పీడ్ పెట్రోలింగ్ బోట్లను అందుబాటులోకి తీసుకురావాలని సూచించారు. తమిళనాడు బోట్ల అక్రమ చొరబాట్ల వల్ల నష్టం కలగకుండా, మన మత్స్యకారుల జీవనోపాధి దెబ్బతినకుండా పటిష్ట చర్యలు తీసుకోవాలని స్పష్టంచేశారు. బాపట్ల నుంచి సుళ్లూరుపట వరకు గస్తీ పెంచాలన్నారు.