శ్రీకాకుళం రూరల్ మండలం సింగపురంలో కల్తీ బాదం పాలు తాగి 80 మంది అస్వస్థకు గురైన సంగతి తెలిసిందే. స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో బాధితులను ఎమ్మెల్యే గుండు శంకర్ శుక్రవారం రాత్రి పరామర్శించారు. అస్వస్థతకు గురైన వారి నుంచి పలు వివరాలు సేకరించి, డిస్కౌంట్లో వస్తున్న బాదంపాలు తాగడం వల్లే ఇలా జరిగి ఉండవచ్చని బాధితులు ఎమ్మెల్యేకు తెలిపారు.