SRD: ఎక్సైజ్ కానిస్టేబుళ్లు సొంత జిల్లాలో పనిచేయకూడదన్న 8(f) నిబంధన ఎత్తివేయాలని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి కోరారు. కుటుంబాలకు దూరంగా ఉండటంతో 150 మంది కానిస్టేబుళ్లు, వారి పిల్లల చదువులకు ఇబ్బంది పడుతున్నారని తెలిపారు. మానవతా దృక్పథంతో ఈ నిబంధనను వెంటనే తొలగించాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.