E.G: టెన్త్ పరీక్షల జవాబు పత్రాల మూల్యాంకనం (స్పాట్ ) సోమవారం నుంచి బీవీఎం ఇంగ్లీష్ మీడియం ఉన్నత పాఠశాలలో జరుగనుందని డీఈవో కంది వాసుదేవరావు తెలిపారు. శుక్రవారం రాజమండ్రి బీవీఎమ్ పాఠశాలలో ఏర్పాట్లను ఆయన పరిశీలించారు. స్పాట్ వాల్యూయేషన్లో పని చేయుటకు జిల్లాలో పనిచేస్తున్న ఉపాధ్యాయులను చీఫ్ ఎగ్జామినర్, అసిస్టెంట్ ఎగ్జామినర్, స్పెషల్ అసిస్టెంట్లుగా నియమించారు.