చెపాక్ స్టేడియంలో చెన్నై సూపర్ కింగ్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. కేవలం 26 బంతుల్లోనే తన అర్ధసెంచరీని పూర్తి చేసి జట్టును విజయతీరాలకు చేరుస్తున్నాడు. ఇన్నింగ్స్‌లో 3 సిక్సర్లు, 4 ఫోర్లతో చెన్నై బౌలర్లపై విరుచుకుపడ్డాడు. ప్రస్తుతం పంజాబ్ గెలుపు ముంగిట నిలిచింది.