TG: 100 నియోజకవర్గాల్లో యంగ్ ఇండియా స్కూల్స్ తీసుకువస్తామని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. ‘రూ.20 వేల కోట్లతో స్కూళ్లు నిర్మిస్తున్నాం. 25 ఎకరాల్లో 6 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో యంగ్ ఇండియా స్కూల్స్ ఏర్పాటు చేస్తున్నాం. రెండో విడతలో మరిన్ని స్కూళ్లను నిర్మిస్తాం. విద్యపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టింది. ఒక విద్యార్థిపై రూ.లక్షా 8 వేలు ఖర్చు చేస్తున్నాం’ అని అన్నారు.