AP: రాజధాని అంశానికి సంబంధించి తమ పార్టీకి స్పష్టమైన వైఖరి ఉందని YCP నేత సజ్జల రామకృష్ణ రెడ్డి అన్నారు. ‘అమరావతి పేరుతో చంద్రబాబు శాశ్వతంగా దోచుకోవాలనే ప్రయత్నం చేస్తున్నారు. మచిలీపట్నం-విజయవాడ-గుంటూరు గ్రోత్ కారిడార్‌గా మెగా సిటీగా అభివృద్ది చెందుతుంది. ఈ ప్లాన్-బీ ద్వారా తక్కువ ఖర్చుతో రియల్ క్యాపిటల్ సాధ్యం. జగన్ ఆలోచనలను గ్రామగ్రామానికి తీసుకెళ్లాలి’ అని సూచించారు.