GNTR: CM చంద్రబాబు శుక్రవారం మంగళగిరి టీడీపీ కార్యాలయానికి వెళ్లారు. ముందుగా అక్కడ ప్రజల నుంచి నేరుగా వినతులు స్వీకరించారు. అనంతరం క్లస్టర్ ఇంఛార్జ్‌లతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. వారితో ‘కాఫీ కబుర్లు’ కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రభుత్వ కార్యక్రమాలను, పథకాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని సూచించారు. పార్టీ శ్రేణులకు ఈ మేరకు ఆయన దిశానిర్దేశం చేశారు.