MDCL: మల్కాజ్గిరిలో నిర్మాణ వ్యర్థాల తొలగింపుపై ప్రత్యేక దృష్టి సారించినట్లు కమిషనర్ వినయ్ కృష్ణారెడ్డి తెలిపారు. రోడ్లపై పేరుకుపోయిన మట్టి, రాళ్లు, డెబ్రిస్ను వెంటనే తొలగించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ప్రజలకు ఇబ్బందులు కలగకుండా స్వచ్ఛమైన వాతావరణం కల్పించడమే లక్ష్యమన్నారు. ఉల్లంఘనలపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.