NGKL: కొల్లాపూర్ మండలం ఎల్లూరులో అలివేలు మంగ- వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు ఘనంగా ముగిశాయి. వేడుకల్లో భాగంగా చివరి రోజు నిర్వహించిన వృషభాల బండలాగుడు ప్రదర్శన పర్యాటకులను ఆకట్టుకుంది. విజేతలకు నిర్వాహకులు మొదటి, ద్వితీయ బహుమతులుగా వెండి పతకాలు అందించారు. రైతులు, గ్రామస్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి కేరింతల మధ్య ఈ పోటీలను ఉత్సాహంగా తిలకించారు.