CTR: పాలీసెట్- 2026 ఆన్లైన్ దరఖాస్తు గడువు ఈనెల 9 వరకు పొడిగించినట్లు పలమనేరు మహిళా పాలిటెక్నిక్ కాలేజ్ ప్రిన్సిపల్ సావిత్రి తెలిపారు. 4 తేదీ నుంచి 9 తేదీకి దరఖాస్తు గడువు పొడిగించారన్నారు. ఇప్పటి వరకు దరఖాస్తు చేసుకోని విద్యార్థులు గడువు లోపల దరఖాస్తు చేసుకోవాలని చెప్పారు.