MBNR: ప్రతి ఒక్కరూ ఆంజనేయ స్వామి మాదిరిగా ధైర్యంతో అడుగులు ముందుకు వేయాలని ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి పిలుపునిచ్చారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని టీడీగుట్ట కాలనీలో హనుమాన్ జయంతి పురస్కరించుకుని ఏర్పాటు చేసిన ప్రసాద పంపిణీలో ఆయన పాల్గొన్నారు. స్వామివారి ఆశీస్సులతో జిల్లా ప్రజలందరూ సుఖసంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు.