TG: నిర్మల్ జిల్లాలోని బాసర ట్రిపుల్ ఐటీకి మంత్రి జూపల్లి కృష్ణారావు వెళ్లారు. ట్రిపుల్ ఐటీలోని వరుస ఘటనలపై విద్యార్థులతో సమావేశం అయ్యారు. రాత్రి హాస్టల్ విద్యార్థులతో మంత్రి బస చేయనున్నారు. కాగా ఇటీవల బాసర ట్రిపుల్ ఐటీలోని సమస్యలను పరిష్కరించాలంటూ విద్యార్థులు నిరసనలు, ఆందోళనలు చేస్తున్న విషయం తెలిసిందే.