W.G: ఇరిగేషన్ అధికారుల తీరుపై మంత్రి నిమ్మల రామానాయుడు సీరియస్ అయ్యారు. ఏప్రిల్, మేలో చేపట్టాల్సిన పనులపై ప్రపోజల్స్ రూపొందించకపోవడం ఏమిటని వీడియో కాన్ఫరెన్సులో ప్రశ్నించారు. ఆదివారం సాయంత్రంలోగా సమర్పించాలని, లేకుంటే స్వయంగా సంజాయిషీ ఇచ్చుకోవాలని హెచ్చరించారు. గత ప్రభుత్వంలో మాదిరే ఇంకా వ్యవహరిస్తామంటే కుదరదని, తీరు మార్చుకోవాలని స్పష్టం చేశారు.