VSP: సింహాచలం ప్రాంతంలోని మహాత్మా జ్యోతిబా పూలే బీసీ గురుకుల పాఠశాలలో సౌకర్యాల లేమిపై భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆకస్మికంగా పాఠశాలను సందర్శించి డార్మెటరీలు, టాయ్లెట్లు తదితరాలను పరిశీలించి, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. సమస్యలను త్వరితగతిన పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.