NLR: రాష్ట్రంలో మహిళలకు రక్షణ కరవైందని, కూటమి ప్రభుత్వ పాలనలో అరాచకాలు పెరిగిపోయాయని వైసీపీ రాష్ట్ర మహిళా వర్కింగ్ ప్రెసిడెంట్ కాకణి పూజిత మండిపడ్డారు. సాక్షాత్తు MLAలే మహిళలపై వేధింపులకు పాల్పడుతుంటే ప్రభుత్వం ఎందుకు మౌనంగా ఉందని ఆమె ప్రశ్నించారు. రైల్వే కోడూరు ఘటనలో బాధితురాలికి న్యాయం చేయకుండా నిందితులను కాపాడుతున్నారంటూ తీవ్రంగా తప్పుబట్టారు.