VZM: వేసవి కాలంలో జరిగే దొంగతనాల పట్ల జిల్లా ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని ఎస్పీ ఏ.ఆర్.దామోదర్ పేర్కొన్నారు. ప్రజలు ఇతర ప్రాంతాలకు వెళ్ళే సమయంలో స్థానిక పోలీసులకు సమాచారం అందించాలన్నారు. పోలీసులకు ముందస్తుగా సమాచారం ఇవ్వడం వలన గస్తీ, పెట్రోలింగ్ సమయాల్లో ఆయా ఇళ్ళపై ప్రత్యేకంగా నిఘా పెట్టే అవకాశం ఉంటుందని సూచించారు.