KDP: పులివెందుల(M) తుమ్మలపల్లి గ్రామానికి చెందిన TDP సీనియర్ నేత మల్లారెడ్డి శుక్రవారం కన్నుమూశారు. ఆయన మృతి పట్ల పులివెందుల TDP ఇంఛార్జ్ బీటెక్ రవి, తుంగభద్ర ప్రాజెక్టు హై లెవల్ కెనాల్ బోర్డు ఛైర్మన్ మారెడ్డి జోగిరెడ్డి సంతాపం వ్యక్తం చేశారు. మల్లారెడ్డి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ, ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుని ప్రార్థించారు.