SRD: అమీన్పూర్ మున్సిపాలిటీలో పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి శుక్రవారం పర్యటించారు. ఈ సందర్భంగా పెండింగ్ పనులు, నూతనంగా చేపట్టబోయే అభివృద్ధి పనులపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ వాటి పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశించారు.