GDWL: జిల్లాలో డా. బాబు జగ్జీవన్ రామ్ 119వ జయంతి వేడుకలను ఈ నెల 5న ఉదయం 10 గంటలకు జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రి ఎదుట నిర్వహించనున్నట్లు ఎస్సీ అభివృద్ధి అధికారి నుషిత తెలిపారు. కలెక్టర్ ఆదేశాల మేరకు జరిగే ఈ కార్యక్రమానికి ప్రజాప్రతినిధులు, అధికారులు, సంఘాల నాయకులు హాజరై విజయవంతం చేయాలని కోరారు. ఈ మేరకు శుక్రవారం ప్రకటన విడుదల చేశారు.