ELR: నానాటికి సమాజంలో పెరుగుతున్న కాలుష్యాన్ని నియంత్రించడానికి వాతావరణ సమతౌల్యం కాపాడడానికి మొక్కల పెంపకం అవశ్యకమని చింతలపూడి ఎమ్మెల్యే సొంగ రోషన్ కుమార్ అన్నారు. శుక్రవారం స్థానిక మార్కెట్ కమిటీ ప్రాంగణంలో వరాహ, మాన్య స్వియర్ కార్బన్ క్రెడిట్ నిర్వహించిన రైతు సదస్సులో ఆయన పాల్గొన్నారు. రైతులకు , ప్రజలకి ఉచితంగా మొక్కలు పంపిణీ చేశారు.