TG: మాజీ మంత్రి జీవన్ రెడ్డి బీఆర్ఎస్లో చేరేందుకు ముహూర్తం ఫిక్స్ అయినట్లు తెలుస్తోంది. ఈనెల 13న ఆయన గులాబీ కండువా కప్పుకోబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈనెల 7న జీవన్ రెడ్డితో మాజీ మంత్రి కేటీఆర్ భేటీ అయి పార్టీలోకి ఆహ్వానించబోతున్నట్లు సమాచారం. కాగా ఇటీవల కాంగ్రెస్కు జీవన్ రెడ్డి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే.