రామ్ చరణ్ హీరోగా, బుచ్చిబాబు దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘పెద్ది’. ఈ మూవీ విడుదలపై వస్తున్న రూమర్లకు ఇప్పటికే చరణ్ క్లారిటీ ఇచ్చాడు. ఏప్రిల్ 30న ఈ సినిమా థియేటర్లలో సందడి చేయనుందని పేర్కొన్నాడు. దీనికి సంబంధించి ఏప్రిల్ 8న ఓవర్సీస్లో అడ్వాన్స్ బుకింగ్స్ ఓపెన్ కానున్నాయి. ఇప్పటికే ఓవర్సీస్ డిస్ట్రిబ్యూటర్లు ప్రమోషన్స్ కూడా ప్రారంభించారు.