NGKL: నల్లమల అడవుల్లో సాగుతున్న సలేశ్వరం జాతరలో RDT సంస్థ భక్తులకు అపద్బాంధవుడిలా నిలుస్తోంది. కఠినమైన కొండ మార్గాల్లో ప్రయాణిస్తూ ప్రమాదవశాత్తు జారిపడిన వారికి, అనారోగ్యానికి గురైన వారికి సంస్థ ప్రతినిధులు తక్షణ వైద్యం అందిస్తున్నారు. అత్యవసర స్థితిలో ఉన్న వారిని అంబులెన్స్‌ల ద్వారా ప్రభుత్వ ఆసుపత్రులకు తరలిస్తూ ప్రాణదాతగా నిలుస్తున్నారు.