ATP: అనంతపురం రామ్‌నగర్‌లో మంత్రి పయ్యావుల కేశవ్ ప్రజాదర్బార్ నిర్వహించారు. జిల్లా నలుమూలల నుంచి వచ్చిన ప్రజల సమస్యలను ఆయన స్వయంగా అడిగి తెలుసుకున్నారు. అర్హులైన ప్రతి పేదవాడికి సంక్షేమ పథకాలు అందడమే ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు. చంద్రబాబు నాయకత్వంలో అభివృద్ధి, సంక్షేమానికి సమ ప్రాధాన్యత ఇస్తూ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తున్నామని వివరించారు.