BDK: బూర్గంపహడ్ మండలంలోని జింకలగూడెం నుంచి అక్రమంగా ఇసుక రవాణా చేస్తున్న లారీని నేడు ఉదయం పోలీసులు పట్టుకున్నారు. ఎస్సై మేడ ప్రసాద్ ఆదేశాల మేరకు సిబ్బంది తనిఖీలు చేపట్టి వాహనాన్ని స్వాధీనం చేసుకుని స్టేషన్కు తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అనుమతులు లేకుండా ఇసుక తరలిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు.