»Ap Governor Abdul Nazeer Suffered Stomach Ache Shifted To Manipal Hospital
AP Governor: ఏపీ గవర్నర్‌కి అస్వస్థత.. ఆస్పత్రికి తరలింపు
ఆంధ్రప్రదేశ్ గవర్నర్ అబ్దుల్ నజీర్ అహ్మద్ శనివారం స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. దీంతో వెంటనే అప్రమత్తమైన ఆయన సెక్యూరిటీ సిబ్బంది తనను హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు.
AP Governor: ఆంధ్రప్రదేశ్ గవర్నర్ అబ్దుల్ నజీర్ అహ్మద్ శనివారం స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. దీంతో వెంటనే అప్రమత్తమైన ఆయన సెక్యూరిటీ సిబ్బంది తనను హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. మణిపాల్ ఆసుపత్రిలో గవర్నర్ అబ్దుల్ నజీర్‌కు వైద్యులు చికిత్స అందిస్తున్నారు. గవర్నర్ ఆరోగ్యం ప్రస్తుతం నిలకడగానే ఉన్నట్లు తెలుస్తోంది. అయితే, గవర్నర్ ఒక్కసారిగా అనారోగ్యానికి గురి కావడానికి గల కారణం ఏంటన్నది తెలియాల్సి ఉంది. గవర్నర్ అనారోగ్యంపై రాజ్ భవన్ ఎలాంటి ప్రకటన వెల్లడికాలేదు.
గతేడాది సెప్టెంబర్‌లో కూడా గవర్నర్జస్టిస్ అబ్దుల్ నజీర్ ఓ సారి అనారోగ్యానికి గురయ్యారు. కడుపు నొప్పితో బాధపడుతూ ఆస్పత్రిలో జాయిన్ అయ్యారు. అప్పుడు కూడా మణిపాల్ ఆసుపత్రి వైద్యులు చికిత్స అందించారు. ఆయనకు వైద్య పరీక్షలు నిర్వహించగా, అపెండిసైటిస్ సమస్యతో బాధపడుతున్నట్టు తేలిందన్నారు. గవర్నర్‌కు రోబోటిక్ అసిస్టెడ్ అపెండిసిటోమీ విజయవంతంగా నిర్వహించినట్లు వైద్యులు వెల్లడించారు.