NRPT: కొత్తపల్లి మండలం బొజ్జ నాయక్ తాండలో కాంక్రీట్ సిమెంట్ రోడ్డు పనులు ప్రారంభమయ్యాయి. పాత రోడ్డు గుంతలతో అధ్వానంగా మారి ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని స్థానికులు తెలిపారు. కొత్తగా పనులు మొదలవడంతో గ్రామస్తులు హర్షం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో కాంగ్రెస్ మండల అధ్యక్షుడు మహేందర్ రెడ్డి, నాయకులు రమేష్ రెడ్డి, సర్పంచ్ రమేష్ నాయక్ పాల్గొన్నారు.