MBNR: తెలంగాణ సాయుధ రైతంగ పోరాట యోధుడు దొడ్డి కొమురయ్య విగ్రహానికి మాజీ మంత్రి సిద్దిపేట శాసనసభ్యులు హరీష్ రావు శుక్రవారం నివాళులర్పించారు. మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలోని పద్మావతి కాలనీ గ్రీన్ బెల్టు వద్ద నూతనంగా ఏర్పాటు చేసిన విగ్రహ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ఆయన హాజరయ్యారు. ఈ కార్యక్రమానికి మాజీమంత్రి డాక్టర్ వి శ్రీనివాస్ గౌడ్ హాజరై నివాళులు అర్పించారు.