NZB: వేల్పూర్ మండలం రామన్నపేట్ గ్రామంలో ఇవాళ ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా మంజూరైన సీఎంఆర్ఎఫ్ చెక్కులను అందజేశారు. ఈ చెక్కులను కాంగ్రెస్ గ్రామ శాఖ అధ్యక్షులు పోన్నాల చిన్నయ్య ఆధ్వర్యంలో లబ్ధిదారులకు ఇచ్చారు. నిరుపేదలకు ఇవి ఎంతగానో ఉపయోగపడతాయని ఆయన అన్నారు. వీటిని అందరూ సద్వినియోగం చేసుకోవాలన్నారు.