KMM: సత్తుపల్లి మండలం రేజర్లలో పేదలకు కేటాయించనున్న ఇళ్ల స్థలాల లేఅవుట్ను ఎమ్మెల్యే డాక్టర్ మట్టా రాగమయి దయానంద్ శుక్రవారం స్వయంగా పరిశీలించారు. అధికారులతో కలిసి క్షేత్రస్థాయిలో పర్యటించిన ఆమె, స్థలాల గుర్తింపు, సరిహద్దులపై ఆరా తీశారు. అర్హులైన ప్రతి పేదవాడికి సొంతింటి కల నెరవేర్చడమే ప్రభుత్వ ధ్యేయమని స్పష్టం చేశారు.