ASF: జిల్లా కలెక్టర్ హరిత ఇటీవల పెద్ద వాగు ప్రాంతాన్ని సందర్శించి, ఇసుక అక్రమ రవాణాపై అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. నిబంధనలు ఉల్లంఘించిన 7 ట్రాక్టర్లను సీజ్ చేయించారు. సామాన్య ప్రజలు మధ్యవర్తుల ప్రమేయం లేకుండా ‘మన ఇసుక వాహనం’ ఆన్లైన్ సేవ ద్వారా ఇసుక బుక్ చేసుకోవాలని, అక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని ఆమె హెచ్చరించారు.