గద్వాల జిల్లా అయిజకు చెందిన రామచంద్రారెడ్డి బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడిగా ఎంపికయ్యారు. గతంలో జిల్లా అధ్యక్షుడిగా చేసిన సేవలను గుర్తించి పార్టీ ఈ బాధ్యతలు అప్పగించింది. అయిజలో బీజేపీ పార్టీ శ్రేణులు ఆయనను సన్మానించాయి. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పార్టీ బలోపేతానికి కృషి చేస్తానని రామచంద్రారెడ్డి అన్నారు.