NDL: అమరావతికి రాజధానిగా చట్టబద్ధత లభించడంతో ఆళ్లగడ్డ పట్టణంలో టీడీపీ శ్రేణులు సంబరాలు నిర్వహించారు. మాజీ ఛైర్మన్ ఏవి సుబ్బారెడ్డి ఆధ్వర్యంలో భారీ కేక్ కట్ చేసి ఆనందం పంచుకున్నారు. అమరావతి అభివృద్ధికి ఈ నిర్ణయం దోహదపడుతుందని నాయకులు పేర్కొన్నారు. ఇకపై పట్టణంలో టీడీపీ కార్యక్రమంలో జనసేన నాయకులను కలుపుకుని ముందుకు సాగుతానని ఏవి సుబ్బారెడ్డి వెల్లడించారు.